Takkellapadu, Andhra Pradesh 522438, India

డాక్టర్ ఉండవల్లి శ్రీదేవి
తాడికొండ నియోజకవర్గం MLA

శ్రీమతి మేరువ విజయలక్ష్మి
గ్రామ సర్పంచ్

వైఎస్ జగన్మోహన్ రెడ్డి
ముఖ్యమంత్రి ఆంధ్రప్రదేశ్

Breaking News

జననేతకు జన్మదిన శుభాకాంక్షలు (విశ్వసనీయత...విలువలకు నిలువెత్తు నిదర్శనం)

జననేతకు జన్మదిన శుభాకాంక్షలు విశ్వసనీయత...విలువలకు నిలువెత్తు నిదర్శనం






 
 అశేష ఆంధ్రావని నాపై కురిపిస్తున్న ఈ అపూర్వ ఆదరాభిమానాలకు ఎప్పటికీ రుణపడిఉంటాను. సమస్యలు చెప్పుకుని భరోసా పొందేందుకు పాదయాత్రకు తరలివస్తున్న ప్రజలు.. అనుక్షణం నా కర్తవ్యాన్ని గుర్తుచేస్తున్నారు. నా పై ఉన్న బాధ్యతను మరింత పెంచుతున్నారు. ప్రజల మేలుకోరే మనందరి ప్రభుత్వం వచ్చి.. రైతన్నల ముఖాల్లో చిరునవ్వులు నింపాలి. ప్రతి అక్కచెల్లెమ్మ ఆర్థిక ప్రగతి సాధించాలి. విద్య, వైద్యం, పారిశ్రామిక, సేవారంగం ఇలా అన్ని రంగాల్లో రాష్ట్రం పురోగతి సాధించాలి. రాష్ట్ర ప్రజలందరి ఆకాంక్షలు నెరవేరాలి. నాన్న బాటలో నడచి, రాష్ట్రానికి సుపరిపాలన అందించాలన్న నా ఈ సంకల్పానికి.. ప్రజల చల్లని దీవెనలు, భగవంతుని ఆశీస్సులే బలాన్నిస్తున్నాయి..






                                     





అవినీతి ప్రభుత్వాన్ని నిలదీసేందుకుం
అసమర్థ ముఖ్యమంత్రిని ప్రశ్నించేందుకుం
అభివృద్ధిని అణువంతైనా చూపని పాలనకు చరమగీతం పాడేందుకు..
ప్రజాపక్షాన నిలిచేందుకుం
ప్రజాగళం వినిపించేందుకుం
వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఆరంభించారు ప్రజాసంకల్ప పాదయాత్ర. 
తన అడుగులతో కురిపిస్తు పాదయాత్రికుడికి, న్నసంకల్ప ధీరుడికీ ఈ రాష్ట్రమే చెబుతోంది పుట్టిన రోజు శుభాకాంక్షలు.
ఈ సందర్భంలో ప్రజా సంకల్ప యాత్ర ఆరంభంలో వైయస్ జగన్ మాట్లాడిన మాటలు ఒక్కసారి గుర్తు చేసుకోవాలి. పాదయాత్రకు ముందు జరిగిన బహిరంగ సభలో ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఎంతో ఉద్వేగంతో మాట్లాడారు. పేదవాడికి సాయం చేయాలనే కసి గుండెల్లో ఉందన్నారు. అధికారంలోఉన్నవాళ్లు ఎన్నో విధాలుగా ఇబ్బంది పెట్టినా, ప్రజలు వెన్నంటి ఉండటం చూసి ఎంతో ధీమాగా అనిపించిందని అన్నారు.
‘చంద్రబాబు లా నాకు కాసులంటే కక్కుర్తి లేదు, ఆయన మాదిరిగా నేను కేసులకు భయపడే ప్రసక్తి లేదు’ అన్నారు యువనేత. ఇది ఓ ప్రతిపక్ష నాయకుడు ప్రభుత్వాధినేతకు విసిరిన సవాల్. అధికార పక్షం ఎన్నో విధాలుగా కక్షగట్టినా నిర్భయంగా ఎలా ఉన్నాడో నిజాయితీగా ఓ నాయకుడు చెప్పిన సందర్భం. ‘నాలో ఉన్న కసి ఒక్కటే రాష్ట్రానికి ప్రత్యేక హోదా తేవాలి. రైతుకు వ్యవసాయాన్ని మళ్లీ పండుగ చేయాలి. ప్రతి నిరుద్యోగికీ ఉద్యోగం అందిచగలగాలి. ప్రతి పేద విద్యార్థీ ఉన్నత చదువులు చదువుకోగలగాలి. పేదవాడు ఉచితంగా వైద్యం చేయించుకోగలగాలి. మద్యపానాన్ని నిర్మూలించగలగాలి. మంచి పనులతో మా నాన్న లా నేనూ ప్రతి మనిషి గుండెల్లో కలకాలం నిలిచిపోవాలింఇదే నా కసి’ అని చెప్పారు వైయస్ జగన్.  














పట్టపగలే భద్రతా వలయాలను ఛేదించుకుని ఆగంతకుడి రూపంలో వైఎస్ జగన్ పై హత్యాయత్నం జరిగింది. పదునైన ఆయుధంతో ప్రాణం తీసేందుకు సిద్ధపడ్డ వ్యక్తి వెనుక చాలా పెద్ద తలలే ఉన్నట్టు సాక్ష్యాలు రూఢీ చేసాయి. కానీ తీగలాగితే కదిలే డొంకను చప్పుడు చేయకుండా దాచిపెట్టింది చంద్రబాబు ప్రభుత్వం. ఇంతటి ఆపద ఎదురైనా, ప్రాణాలకే ప్రమాదం పొంచి ఉందని తెలిసినా వైఎస్ జగన్ వెరవలేదు. వెనక్కు తగ్గలేదు. గాయం పూర్తిగా మానకుండానే తన పాదయాత్రను తిరిగి ఆరంభించారు. బెదిరింపులు, దాడులు తన ఆశయాన్ని చంపలేవని చిరునవ్వుతోనే సమాధానం చెప్పారు వైఎస్ జగన్. అలుపెరుగని యోధునికి గాయాలు అడ్డంకి కాదని నిరూపించారు. సంకల్పధీరుడిలా ఆ యువనాయకుడు కదిలి వస్తుంటే కదన రంగంలో కాలుపెడుతున్న వీరుడుని చూస్తున్నట్టు ఉందంటున్నారు ప్రజలు. వెనకడుగు వేయని వ్యక్తిత్వం, ప్రజల కోసమే పనిచేసే శ్రమతత్వం వైయస్ జగన్.
















1 comment: