చెర్రీ జ్యూస్‌తో నిద్రలేమి సమస్యకు చెక్...
నిద్రలేమి సమస్య వయస్సు పైబడిన వారిలో సాధారణంగా ఉండే సమస్య. చాలామందిని
పలు రకాలుగా బాధపెట్టే ఈ సమస్యను చెర్రీ జ్యూస్‌తో చెక్ పెట్టొచ్చని
పరిశోధనలో తెలియజేశారు.
ఈ జ్యూస్‌లో విటమిన్స్, ప్రోటీన్స్ అధికంగా
ఉన్నాయి. అందుచేత దీర్ఘకాలంగా నిద్రలేమి సమస్యతో బాధపడేవారు ప్రతిరోజూ
రెండు పూటలా చెర్రీ జ్యూస్ తీసుకుంటే చక్కని నిద్ర పడుతుంది.
చెర్రీ జ్యూస్ తాగడం వలన పలు రకాల ఆరోగ్య ప్రయోజనాలు
పొందవచ్చును. ఈ జ్యూస్ తీసుకోవడం ద్వారా నిద్రలేమి అధిగమించవచ్చని
చెబుతున్నారు. అంతేకాకుండా చెర్రీ జ్యూస్ శరీరంలోని వ్యర్థ పదార్థాలను
బయటకు పంపుతుంది. అలసట, ఒత్తిడి వంటి సమస్యలను తొలగిస్తుంది. చెడు
కొలెస్ట్రాల్‌ను తగ్గిస్తుంది. జ్ఞాపకశక్తి పెంచేందుకు చెర్రీ జ్యూస్
చక్కగా ఉపయోగపడుతుంది.
No comments