కరివేపాకు, ధనియాలు చూర్ణాన్ని అన్నంలో కలుపుకుని తీసుకుంటే?
అధిక రక్తపోటు వయసు పెరిగిన వాళ్ళని చాలా ఇబ్బంది పెడుతుంది. ఈ సమస్యను
అదుపులో ఉంచేందుకు ఈ చిట్కాలు పాటిస్తే మంచి ఫలితం ఉంటుంది.
కొలెస్ట్రాల్,
మధుమేహం, మూత్రాశయ సమస్యలు, మానసిక ఒత్తిడి వంటి అనేక రకాల వ్యాధుల వలన
అధిక రక్తపోటు సమస్యలు ఎదురవుతాయి. నిత్యం తీసుకునే ఆహారంలో ఉప్పును
ఎక్కువగా తీసుకోకూడదు.
10 నిమిషాల పాటు శరీరం, మనసుకు విశ్రాంతి ఇవ్వాలి. అందుకు 40 నిమిషాల పాటు
అటూఇటూ నడవాలి. ఇలా చేయడం వలన అధిక రక్తపోటు అదుపులో ఉంటుంది. నాడీశుద్ధి
ప్రాణాయామం, భ్రమరీ ప్రాణాయామం, ఓంకార సాధన వంటివి చేస్తుంటేనే మానసిక
ప్రశాంతత చేకూరుతుంది. తద్వారా రక్తపోటు అదుపులో ఉంటుంది.
వెల్లుల్లి రెబ్బలను తరచుగా ఆహారంలో చేర్చుకుంటే అధిక రక్తపోటు,
కొలెస్ట్రాల్ వంటి సమస్యలు తొలగిపోతాయి. కరివేపాకు, ధనియాలు బాగా
వేయించుకుని పొడిచేసుకోవాలి. ప్రతిరోజూ ఈ మిశ్రమాన్ని వేడివేడి అన్నంలో
కలుపుకుని తీసుకుంటే ఆరోగ్యానికి చాలా మంచిది. అశ్వగంధ చూర్ణంలో కొద్దిగా పాలు కలుపుకుని తీసుకుంటే రక్తపోటు సమస్యలకు చెక్ పెట్టవచ్చును.
No comments