Takkellapadu, Andhra Pradesh 522438, India

డాక్టర్ ఉండవల్లి శ్రీదేవి
తాడికొండ నియోజకవర్గం MLA

శ్రీమతి మేరువ విజయలక్ష్మి
గ్రామ సర్పంచ్

వైఎస్ జగన్మోహన్ రెడ్డి
ముఖ్యమంత్రి ఆంధ్రప్రదేశ్

Breaking News

వర్షాకాలంలో హాట్ హాట్‌గా పుదీనా టీ టేస్ట్ చేస్తే?

వర్షాకాలంలో వ్యాధుల నుంచి తప్పించుకోవాలంటే.. పుదీనా టీని రోజుకో కప్పు సేవిస్తే సరిపోతుందని ఆయుర్వేద నిపుణులు సూచిస్తున్నారు. పుదీనా నొప్పిని తగ్గిస్తుంది.
పెయిన్ కిల్లర్‌గా పనిచేస్తుంది. పార్శ్వపు తలనొప్పి, ఆందోళన, ఒత్తిడిలో ఉన్నప్పుడు వచ్చే తలనొప్పిని పుదీనా తగ్గిస్తుంది.





ఒక టేబుల్‌ స్పూను ఎండిన పుదీనా ఆకుల్ని మరిగించిన నీటిలో వేయాలి. పది నిమిషాల తర్వాత ఆ నీటిని తాగితే తలనొప్పి నుంచి ఉపశమనం లభిస్తుంది. ఇంకా పుదీనాలోని పోషకాలు వ్యాధినిరోధక శక్తిని పెంచుతాయి. 
అలాగే వర్షాకాలంలో గ్రీన్ టీని కూడా తీసుకోవాలి. ఇందులో యాంటీ యాక్సిడెండ్లు అలెర్జీలను దూరం చేసి.. జీవక్రియను మెరుగుపరుస్తాయి. దీనివల్ల శరీరంలో క్యాలరీలు ఎక్కువగా ఖర్చవుతాయి.
బరువు తగ్గాలనుకునే వారికి గ్రీన్ టీ ఎంతో మేలు చేస్తుంది. రోజుకు రెండు లేదా మూడు కప్పుల గ్రీన్‌ టీ తాగితే బరువు పెరగరు. ముఖ్యంగా అల్లం టీని వర్షాకాలంలో సేవించడం ద్వారా అర్థ్రరైటిస్ సమస్య తొలగిపోతుందని ఆయుర్వేద నిపుణులు సూచిస్తున్నారు.

No comments